హైదరాబాద్ : వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు ఆల్ఇండియా ఓబీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు దునుకు వేలాద్రి తెలిపారు. ఆర్ట్స్ కళాశాలలోని రూమ్ నం.140లో రోజూ ఉదయం 6 నుంచి రెండు గంటల పాటు ఈ తరగతులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ఓయూ విద్యార్థులతోపాటు పీజీఆర్ఆర్సీడీఈ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా వినియోగించుకోవచ్చన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm