సీనియర్ నటుడు సదాశివ బ్రహ్మావర (90) కన్నుమూశారు. బుధవారం ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వయఃభారం కారణంగానే మృతి చెందారని పేర్కొన్నారు. దాదాపు 150 సినిమాల్లో ఆయన నటించారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కట్టిపడేసేలా నటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బనశంకరిలో గురువారం అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm