హైదరాబాద్ : జేఎన్టీయూహెచ్ వర్సిటీ ఈడీసెల్ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ ఫైనాన్స్ డ్యూరింగ్ అనే అంశంపై ఈనెల 28 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు వర్క్‌షాపు నిర్వహించడం జరుగుతుందని ఈడీసెల్ కో-ఆర్డినేటర్ ఎం.ఆశారాణి ఓ ప్రకటనలో తెలిపారు. యువత, విద్యార్థులలో వ్యవస్థాపకత నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రోత్సాహం, ఉద్యోగ కల్పనకు గల అవకాశాలు, మార్కెటింగ్, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, బ్యాంకు లోన్స్, ఇన్వెస్ట్మెంట్ తదితర అంశాలపై వర్సిటీ క్లాస్రూమ్ కాంప్లెక్స్‌లో వర్క్‌షాప్ నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గల గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 70366 66424/9490684344/9000779009 నం బర్లలో సంప్రదించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm