Fri 12 Oct 10:00:14.631215 2018
చెన్నై : దుబాయ్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో టేకాఫ్ చేస్తున్న సమయంలో గోడను ఢీకొంది. ఈ ఘటనలో విమానంలోని 136 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా ఉన్నారు. విమానాన్ని ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో విమానం క్షేమంగా దిగింది. ప్రయాణీకులకు మరొక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియా విమానం స్వల్పంగా దెబ్బ తిన్నది. దానికి మరమ్మతులు చేస్తున్నారు.
Recomended For You