ఇమ్రాన్ హష్మి తాజాగా తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృంగార సన్నివేశాలు లేదా ముద్దు సీన్స్‌పై హీరోయిన్స్‌తో చర్చించాక, వారు అభ్యంతరాలేమి చెప్పకపోతే ఆ సన్నివేశాలలో పాల్గొంటానని అన్నాడు. వెండితెరపై రచ్చ చేసే ఈ హీరో తాజాగా మీటూ ఉద్యంపై తన నిర్ణయం ప్రకటించారు. దీంతో ఆయనపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. తన కంపెనీలలో ఎవరైన లైంగిక వైధింపులకి పాల్పడితే సహించేదే లేదని ఇమ్రాన్ తెలిపాడు. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేదింపులు నివారణ చట్టం 2013ను తన కంపెనీలో అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇండియా అంతటా మీటూ ఉద్యమం చర్చనీయమైన నేపథ్యంలో ప్రముఖులు అందరు తన వాదనని వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm