చెన్నై : తమిళనాడులో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. కన్నకూతురిపైనే హత్యాచారం చేసిన తండ్రి..! అనే ఘటనలు ఎన్నో జరిగాయి కానీ ఇక్కడ కూమార్తెపై కన్నతల్లే ఇలాంటి పాడు పనికి ఒడిగట్టింది. పద్నాలుగేళ్ల కుమార్తెతో స్వలింగ సంపర్కానికి ప్రయత్నిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన తల్లిని, దానిని ప్రోత్సహించిన బామ్మను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని తేనాంపేటలో ఆ బాలిక తల్లిబామ్మలతో నివసిస్తుండేది. తల్లితో మనస్పర్థలు రావడంతో తండ్రి విడిపోయాడు. కాగా ఆమె తల్లి స్వలింగ సంపర్కం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ బాలికను వేధించసాగింది. దీనిపై ఆ బాలిక తన తండ్రికి చెప్పగా తట్టుకోలేకపోయాడు. పలుమార్లు హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడంతో అతను పోలీస్టేషన్ మెట్లు ఎక్కాడు. అతను తన భార్య, అత్త కలిసి కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాక్ష్యంగా సెల్ఫోన్లో వీడియో ఆధారాన్ని కూడా పోలీసులకు సమర్పించాడు. పోలీసులు బాలిక తల్లిని పోక్సో చట్టం క్రింద, దీనికి ప్రోత్సహించిన ఆమె బామ్మను అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm