హైదరాబాద్ : హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 8110 4జీ బనానా స్లైడర్ ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. అరటిపండు ఆకృతిలో వంపు కలిగి ఉండడం దీని ప్రత్యేకత. జియో ఫోన్లో ఉపయోగించే కై ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ 4జీ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లో గతంలో ఆదరణ పొందిన కీప్యాడ్ స్లైడర్ విధానాన్ని చేర్చారు. దీని ద్వారా కాల్ వచ్చినప్పుడు కీప్యాడ్ స్లైడ్ చేసి సమాధానం ఇవ్వొచ్చు. వాట్సప్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌తోపాటు అన్ని రకాల గూగుల్ యాప్స్ ఈ ఫోన్లో ఉపయోగించుకోచ్చని సంస్థ తెలిపింది. నోకియా పాత తరం ఫోన్లలో బాగా ప్రాచుర్యం పొందిన స్నేక్ గేమ్‌ను ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఇవ్వనున్నారు. అక్టోబరు 24 నుంచి ఈ ఫోన్ అన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ అందుబాటులోకి రానుంది.
ఫీచర్లు:
డ్యుయల్ సిమ్ (మైక్రోంనానో)
ఓస్: కై
2.45 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే
2 మెగా పిక్సల్ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
512 ఎంబీ ర్యామ్
4 జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యం
ఇంటర్నెట్ అనుసంధానానికి 4జీ వోల్ట్, హాట్‌స్పాట్, వైఫై సౌకర్యాలు
1500 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు రూ.6 వేలు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 12,2018 11:46AM