ఢిల్లీ: సినీ పరిశ్రమతో పాటు అన్ని రంగాల్లోనూ పాతుకుపోయిన లైంగిక వేధింపుల జాఢ్యాన్ని 'మీ టూ' పేరుతో మహిళలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్, బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, గీత రచయిత వైరముత్తులు తమను లైంగికంగా వేధించారని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీటూ బాధితులకు మద్దతుగా నిలిచారు.
'మహిళలతో మర్యాదగా, గౌరవంగా ఎలా ప్రవర్తించాలో ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అలా చేయని వారికి అన్ని రంగాల్లో దారులు మూసుకుపోతుండటం సంతోషకరమైన విషయం. ఇప్పటి పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే నిజాన్ని గట్టిగా, నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉంది' అని రాహుల్ ఈ రోజు ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 12,2018 03:04PM