కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం 78వ వర్ధంతి బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణఆదిత్య ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. సభా వేదికతోపాటు, వీఐపీల వాహనాల పార్కింగ్, భోజన స్థలాలు సిద్ధం చేయగా, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక పనులు కొనసాగుతున్నాయి. హెలీపాడ్, వేదిక, వర్ధంతి నిర్వహణ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు
Mon Jan 19, 2015 06:51 pm