హైదరాబాద్: నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మరో ట్రీట్ లభించింది. 'షేడ్స్ ఆఫ్ సాహో' అంటూ ఃసాహోఃఱళి ప్రభాస్ తాజా లుక్ ను విడుదల చేసిన టీమ్, అదే పేరిట అదిరిపోయే వీడియోనూ విడుదల చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీలో నిర్మితమవుతున్న చిత్రంలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని ఈ వీడియో చూపిస్తోంది. హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దించిమరీ షూట్ చేసిన ఫైట్ సీన్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలను, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అబుదాబిలో జరిగిన చిత్ర షూటింగ్, కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వీడియోకు థమన్ సంగీతం అందించాడు. ఃసాహోః కు మాత్రం శంకర్ ఈశన్ లాయ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm