హైదరాబాద్: తెలుగు సూపర్ హిల్ చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించి మెప్పించిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్, తాజాగా నిషేధిత ఉత్ప్రేరకాలను దగ్గరుంచుకున్న కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం నార్కోటిక్స్ అధికారుల అదుపులో ఉన్న ఆయన్ను నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. బిగ్ బాస్ తో పాప్యులర్ అయిన అజాజ్, సినిమాల కన్నా, వివాదాలు, అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లోకి నిలుస్తుంటాడన్న సంగతి తెలిసిందే. అతని నుంచి 2.3 గ్రాముల డ్రగ్స్, రూ. 2.20 లక్షల నగదు, సెల్ ఫోన్స్ ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు. తెలుగులో అజాజ్ ఖాన్, 'దూకుడు', 'నాయక్', 'బాద్ షా' తదితర చిత్రాల్లో నటించాడు.
Mon Jan 19, 2015 06:51 pm