హైదరాబాద్: తెలంగాణలో చేనేత కుటుంబాలకు నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమంపై మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ప్రతి చేనేత, పవర్లూమ్ కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయిల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm