ఢిల్లీ: సాధారణంగా మనం ఓ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడి ఆహారం, సర్వింగ్ విధానం నచ్చితే సర్వర్లకు టిప్‌లు ఇస్తుంటాం. అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబ్ స్టార్ మిస్టర్ బీస్ట్ గత శనివారం ఉత్తర కరోలినాలోని గ్రీన్విల్లేలో ఉండే సూప్ డాగ్స్ అనే రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ బీస్ట్ రెండు గ్లాసుల మంచినీళ్లు ఆర్డర్ చేయగా సర్వర్‌గా పనిచేస్తున్న అలైనా కస్టర్ బీస్ట్‌కు సర్వ్ చేసింది. నీళ్లు తాగేసి బీస్ట్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అలైనా టేబుల్ దగ్గరకు వెళ్లి చూడగా.. పది వేల డాలర్ల నోట్ల కట్ట కన్పించింది. అది చూసి తొలుత అలైనా షాక్‌కు గురైంది. తనతో ఎవరైనా జోక్ చేస్తున్నారేమో అని అక్కడున్నవాళ్లను అడిగింది. అయితే టేబుల్ మీదున్న చీటి చూసిన తర్వాత అలైనా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయింది. 'రుచికరమైన నీటిని అందించినందుకు కృతజ్ఞతలు' అని చీటి రాసి బీస్ట్ అలైనాకు 10వేల డాలర్ల టిప్ ఇచ్చారు.
ఈ విషయాన్ని సూప్ డాగ్స్ రెస్టారెంట్ తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకుంటూ అలైనా ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీస్ట్ ఉదారతను పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 03:28PM