హైదరాబాద్: 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా ఉందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని అన్నారు. తాను రాయలసీమ వాడినేనని, సీమ ప్రజలను కించపరిచేలా ఎటువంటి సన్నివేశాలు ఈ చిత్రంలో లేవని, ఫ్యాక్షనిజం కూడా లేదని స్పష్టం చేశారు. ప్రశాంతత కోరుకునే వారందరితో కలిసి సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయొచ్చన్నదే ఈ సినిమా సారాంశమని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm