నాగపట్టణం: 16వశతాబ్దం నాటి చారిత్రక చర్చి తుఫాన్ ధాటికి దెబ్బతిన్నది. నాగపట్టణం జిల్లా వేళాంకణిలోని బాసిలికా చర్చి ఈదురుగాలులతో తీవ్రంగా ధ్వంసమైంది. గోథిక్ నిర్మాణశైలిలో రూపొందించిన అరుదైన అందమైన ఈ చర్చి తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఈదురుగాలుల బీభత్సంతో.. చర్చి శిఖరంపై ఉన్న క్రాస్ కూలిపోయిందని, చర్చి ముందున్న 75 అడుగుల ఎత్తయిన జీసస్ రాతి విగ్రహపు చేతులు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm