హైదరాబాద్: బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నది. ఇప్పటి వరకు 86 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో 32 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, బహుజనవాదం పేరుతో కరపత్రాలను నియోజకవర్గాల్లో విస్తృతంగా పంచుతున్నారు. ఆ తర్వాత ప్రజా నాట్యమండలి బృందం ఆటపాటలతో బీఎల్ఎఫ్ విధానాలను ప్రచారం చేస్తున్నది. అభ్యర్థులు ప్రచారం చేసే గ్రామాలకు ముందే వెళ్లి ప్రజలను జాగృతం చేస్తున్నది. ఆ తర్వాత బీఎల్ఎఫ్ అభ్యర్థులు చెప్పే మాటలకు, విధానాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ బీఎల్ఎఫ్ను బలపరచాలని కోరుతున్నారు. ఇతరుల కంటే భిన్నంగా బీఎల్ఎఫ్ అభ్యర్థులు ప్రచారం చేయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రజలు వివరించే సమస్యలకు ప్రత్యామ్నాయ విధానాల ద్వారా చూపే పరిష్కారం అందరినీ ఆలోచింపచేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm