న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) ఈ మధ్యనే అంగారక గ్రహం మీదకు ఇన్సైట్ ల్యాండర్‌ను పంపించింది. అయితే అక్కడికి వెళ్లిన తరవాత ఆ ల్యాండర్ ఒక సెల్ఫీ తీసుకుంది. ఇప్పుడు దాన్ని ఇన్సైట్ అధికారిక ట్విటర్ ఖాతాలో నాసా పోస్ట్ చేసింది. ఆ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ సెల్ఫీలో సోలార్ ప్యానెల్స్, డెక్ కనిపిస్తున్నాయి. అలాగే ఇతర పరికరాలు, వాతావరణ పరిస్థితులను పసిగట్టే సెన్సర్, యూహెచ్ఎఫ్ యాంటెన్నాతో పాటు అంగారక గ్రహం మీద ధూళితో నిండిన పరిసరాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ సెల్ఫీ ఎలా తీశారో నాసా వెల్లడించింది. ాఆ వ్యోమనౌక తన రోబోటిక్ ఆర్మ్‌తో మొదటి సెల్ఫీని తీసుకుంది. మొత్తం 11 చిత్రాలను కలిపితే ఏర్పడింది్ణ అని తెలిపింది. అది తీసిన ఫొటోలన్నీ కలిపి ఈ చిత్రానికి తుది రూపు ఇచ్చారు.
ఇది మొదటి సెల్ఫీ! అక్కడ నేను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నాను. అంగారకుడి మీద నేనిలా ఉన్నాను అని ఇన్సైట్ ఖతాలో ఓ ట్వీట్ కూడా చేశారు. అలాగే అది పనిచేసే అంగారకుడి ల్యాండ్ ఫొటోను కూడా షేర్ చేశారు. అది 52 ఫొటోల సమ్మేళనం. అంగారకుడి మీద నుంచి వచ్చిన ఈ రోబోటిక్ సెల్ఫీ.. అన్ని సెల్ఫీలకు మహారాణి, బాగుంది, మార్స్‌కు సంబంధించిన అన్ని ఫొటోలు పంపే వరకు నేను ఎదురుచూస్తాను, ఇది అమేజింగ్ ఇలా నెటిజన్లు రోబోటిక్ సెల్ఫీ పై స్పందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 12,2018 09:00PM