కారకాస్: వెనిజులా రష్యా త్వరలో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా వెనిజులాకు చేరుకున్న రష్యా వాయుసేకు వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో స్వాగతం పలికారు. సోమవారం ఈ సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఇరుదేశాలూ అన్నిరంగాలలో మైత్రీ సంబంధాలను అభివృద్ధి చేసుకుంటున్నాయని, ముఖ్యంగా సైనిక సంబంధాల అభివృద్ధిపై దృష్టి సారించాయని వివరించారు. 2018 రష్యా-వెనిజులా సంయుక్త సైనిక విన్యాసాలు ఇరుదేశాల వైమానిక సంపత్తిని, సాంకేతిక సహకారాన్ని ప్రతిబింబించటంతో పాటు తాము పరస్పరం అనుభవాలను పంచుకుంటామని పాడ్రినో వివరించారు. తాము శాంతి కాముకులమే కానీ, యుద్ధోన్మాదులం కాదని ఆయన స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm