హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల్లో విజయ నగారా మోగించిన టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.25 గంటలకు కెసిఆర్‌తో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపొందడంతో కెసిఆర్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది కూడా ప్రస్తుత గవర్నర్ నరసింహనే. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. కెసిఆర్‌తో పాటు ఒకరు లేదా ఇద్దరు ఎంఎల్ఎలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. హరీశ్‌రావు పేరు వినిపిస్తోంది. ఎస్సి లేదా మైనార్టీ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి సిఎంతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించనుందనే వార్తలు కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm