హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గం టలకు రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో నగర పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మోనప్ప జంక్షన్ నుంచి వీవీ విగ్రహం జంక్షన్ (పంజాగుట్ట - రాజ్‌భవన్ క్వార్టర్స్రోడ్) వరకు ఈ రోడ్డులో వాహనాలను అనుమతించరు. ఈ సమయంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ అడిషనల్ సీపీ ట్రాఫిక్ అనిల్ కుమార్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm