హైదరాబాద్ : శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచె మనసు నిర్మితమైంది. ఈ నెల 21వ తేదీన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి శర్వానంద్ మాట్లాడాడు. ఈ సినిమాలో ఆయన సాయిపల్లవి వైపు నుంచి కొంతసేపు అజ్ఞాత ప్రేమికుడిగా కనిపిస్తాడు. ఆ విషయాన్ని గురించి యాంకర్ ప్రస్తావిస్తూ .. నిజ జీవితంలో అజ్ఞాత ప్రేమికుడిగా ఉన్నారా? అని ప్రశ్నించింది.
ఈ ప్రశ్న శర్వానంద్ ను కాస్త ఇబ్బంది పెట్టింది. కొంచెం సేపు ఆయన ఆలోచించుకుని .. అజ్ఞాత ప్రేమికుడిగా వున్నాను .. ఇప్పటికీః అంటూ సమాధానమిచ్చాడు. ఎవరికో తెలుసుకోవచ్చా? అని యాంకర్ అడిగితే, ఆ విషయాలు చెప్పకూడదు అంటూ తప్పించుకున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి .. బోట్ సీన్ .. బస్ లోను .. ట్రైన్ లోను హీరోయిన్ వెంటపడే సీన్స్ తనకి బాగా నచ్చాయని శర్వానంద్ చెప్పుకొచ్చాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 15,2018 12:55PM