హైదరాబాద్ : వన్ ప్లస్ 6టీ ఇప్పుడు మరో ఎడిషన్ లో కూడా వినియోగదారులకి అందుబాటులోకి రానుంది. గతంలో వన్ ప్లస్ 6 అవెంజర్ ఎడిషన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా వన్ ప్లస్ 6టీ 'మెక్ లారెన్ ఎడిషన్'లో లభ్యం కానుంది. ఈరోజు నుండే విక్రయానికి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్లో 10 జీబీ ర్యామ్ ని ఏర్పాటు చేశారు. దీని ధర రూ.50999గా నిర్ణయించారు.ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ తో పాటు యాక్సిస్ బ్యాంకు కార్డులపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి.
వన్ ప్లస్ 6టీ ప్రత్యేకతలు:
6.41 ఫుల్ హెచ్డీ డిస్ప్లే (1080 x 2340 పిక్సల్స్)
స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం
10 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
16/20 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్ బ్యాటరీ
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 15,2018 04:22PM