హైదరాబాద్ : తెలంగాణ కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం సిద్ధం చేసుకుంటుంది. ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పంచడానికి తొంబై లక్షల చీరలను ప్రభుత్వం సిద్ధం చేసుకున్నా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ పంపిణీకి బ్రేక్ పడింది. తెరాస నేతలు ఒకరకంగా చీరల పంపిణీ చేయాలనీ ప్రయత్నించినా ఎన్నికల కమిషన్ దానిని అడ్డుకుంది. మళ్ళీ త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే చీరల సరఫరా పూర్తి చేయాలని కొత్త ప్రభుత్వం సన్నాహాలను సిద్ధం చేసుకుంటుంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే వారంలో 95 లక్షల చీరలను పంచేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm