హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మంత్రి పదవి వరిస్తుందా? ఇస్తే ఏ శాఖ కేటాయిస్తారు? ఇదే ఆ సెగ్మెంట్లో ఇప్పుడు హాట్‌టాపిక్. నాయకులు, కార్యకర్తలు తమ నాయకునికి మంత్రి పదవి రావాలని కోరుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగిన ఆయనకు అపార అనుభవం ఉంది. దానం నాగం ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక పార్టీకి ఒక బలాన్ని ఇవ్వడమే కాకుండా సునాయాసంగా గెలిచారు. దాదాపుగా 28వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొందిన దానం నాగేందర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల్లో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇప్పటికే నగరం నుంచి బీసీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు, పద్మారావుగౌడ్‌కు ఇప్పటి వరకు మంత్రులుగా కొనసాగారు. ఈ సారి బీసీ సామాజికి వర్గానికి చెందిన దానం నాగేందర్‌కు ఇవ్వనున్నట్టు చర్చ నడుస్తోంది. అయితే ఎవరికి మంత్రి పదవి ఇస్తారో, ఎవరు మంత్రిగా ప్రమాణం చేస్తారో రెండు రోజుల్లో తేలనుంది. వన్ ప్లస్ వన్‌గా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గతంలో రెవెన్యూ, స్టాంప్స్ శాఖల మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పని చేసిన మహమ్మద్ అలీకి ఇప్పటికే హోం శాఖ కట్టబెట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm