హైదరాబాద్ : కొలంబియన్ పాప్ సింగర్ షకీరాపై కేసు నమోదైంది. 14.5 మిలియన్ యూరోల (రూ.118 కోట్లు) పన్నును ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీరాపై తాజాగా స్పెయిన్‌లో అభియోగాలు నమోదయ్యాయి. షకీరా 2015లో తన నివాసాన్ని బహమాస్ నుంచి బార్సెలోనాకు మార్చింది. అక్కడామె తన భాగస్వామి, బార్సెలోనా ఫుట్‌బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‌తో కలిసి నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.
2012 నుంచి 2014 వరకు షకీరా బార్సెలోనాలోనే నివసించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన షోల ద్వారా సంపాదించిన మొత్తంలో పన్ను కట్టాల్సి ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. షకీరా ఎక్కువ కాలం స్పెయిన్‌లో ఉందని, విదేశాల్లో అతి తక్కువ సమయం మాత్రమే ఉందని తెలిపారు. షకీరాపై నమోదైన అభియోగాలపై స్పందించేందుకు ఆమె ప్రతినిధులు నిరాకరించారు. షకీరా పన్ను ఎగవేత ఆరోపణలపై 11 నెలల క్రితమే న్యాయాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. తాజాగా అభియోగాలు నమోదయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 10:02AM