హైదరాబాద్ : చెన్నైలో కరుడుగట్టిన రేపిస్ట్ అయ్యాడు. 50 మందికి పైగా రేప్ చేసిన అరివళగన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో, రోడ్లపై నడిచివెళ్లే ఒంటరి మహిళలే టార్గెట్గా నిందితుడు దాడి చేసి అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతులు, నైట్ డ్యూటీ చేసే మహిళలే బాధితులు ఉన్నారు. వారితో ఇంటి వరకూ వెళ్లడం, బలవంతంగా ఇంట్లో చొరబడి బెదిరించి రేప్ చేసేవాడని పోలీసులు వెల్లడించారు. రేప్ చేస్తుండగా నిందితుడు అరివళగన్ వీడియోలు తీసేవాడని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అరివళగన్ను అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm