ముంబయి : మలయాళ చిత్రం ఒరు అదార్ లవ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవి పాటలో కన్నుగీటి ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే ఈ చిత్రం విడుదల కాకముందే ఈ అమ్మడు బాలీవుడ్లో అడుగు పెట్టేసింది.
ప్రియా వారియర్ నటిస్తున్న తొలి చిత్రానికి శ్రీదేవి బంగ్లా్ణ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసినట్టు సమాచారం. దాదాపు రూ.70 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన భగవాన్ చిత్రం ఫేమ్ ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 07:22PM