ముంబై: బాలీవుడ్ తొలితరం నటుడు వినోద్ ఖన్నా తొలి భార్య గీతాంజలి ఖన్నా(70) కన్నుమూశారు. ఆమె మృతికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే, గత కొంతకాలంగా ఆమె గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన గీతాంజలిని శనివారం రాత్రి అలీబాగ్ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm