వరంగల్ రూరల్: స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుడు, పరకాల పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, ఆపార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్ర రవికుమార్(46) గుండె పోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కధనం ప్రకారం... వజ్ర రవికుమార్ గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు హన్మకొండ లోని ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా... చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రవికుమార్‌ను పరీక్షించిన ఆ ఆస్పత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతునికి భార్య రేవతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవికుమార్ మృతితో పరకాల పట్టణంలో విషాదం నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm