సిద్దిపేట: హరీష్రావు ఈరోజు సిద్దిపేటలోని 1వ వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు సిద్దిపేట ప్రజల ఘనతను పెంచెలా పనిచేస్తానని ఆయన అన్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఘనత సిద్ధిపేట ప్రజలతే అని కొనియాడారు.కష్టపడే నాయకుడిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని నిరూపించారని హరీష్ పేర్కొన్నారు. పెద్ద కొడుకు లాగా సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీరలను ఎన్నికల కోడ్ అంటూ కాంగ్రెసోళ్లు అడ్డుకున్నారని మండిపడ్డారు. మొక్కులు పెంచి హరిత సిద్ధిపేటగా మార్చాలని, క్యాన్సర్ లాంటి రుగ్మతల నుంచి కాపాడుకోవాలని హరీష్రావు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm