టోక్యో:ఈ విశ్వంలో నీరే జీవాధారం. ఎక్కడ నీరున్నా.. అక్కడ ప్రాణకోటి ఉన్నట్లే. అందుకే ఇంకా విశ్వంలో ఎక్కడెక్కడ నీరుందన్న పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. సుమారు 17 గ్రహశకలాలపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు తేల్చారు. అకారి ఉపగ్రహం అందించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని వారు తెలిపారు. ఇన్ఫ్రా రెడ్ కెమెరాల ఆధారంగా .. గ్రహశకలాల అధ్యయనం జరిగింది. అయితే గ్రహశకలాలు నీటిని పీల్చుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ జపాన్ జర్నల్లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు. సౌర కుటుంబంలో ఎక్కడెక్కడ నీరుందన్న విషయం మరింత స్పష్టమైనట్లు సైంటిస్టులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm