హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతిఇరానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని పదవిపై కలలు కనేందుకు రాహుల్ ట్యూషన్ తీసుకుంటున్నారని సెటైర్లు వేశారు. రాహుల్ కు ఆ పార్టీ నేతలు ఎలా మాట్లాడాలో చెబుతున్న ఒక వీడియోను ట్విట్టర్ ఖాతాలో కేంద్రమంత్రి పోస్ట్ చేసి విమర్శలు సంధించారు. రాహుల్ తన సొంత మాటల కంటే పక్క వాళ్లు చెప్పేదాన్నే నమ్ముతారని వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి తెలుస్తుందన్నారు. అయినా రాహుల్ ఏ పదవికీ అర్హుడు కాదన్న విషయాన్ని దేశ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm