బ్రస్సెల్స్: బెల్జియం ప్రధాని ఛార్లెస్ మైకేల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వలసలపై ఏర్పడిన వివాదంతో సంకీర్ణ కూటమి భాగస్వామ్య పక్షం ప్రభుత్వం నుండి తప్పుకున్న రెండు వారాల్లోనే ఆయన పదవికి రాజీనామా చేయటం విశేషం. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మైకేల్ ఐరాస వలసల ఒప్పందం విషయంలో న్యూఫ్లెమిష్ అలయెన్స్ (ఎన్-విఎ) మద్దతు కోల్పోవటంతో, ఆయన ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ ఒప్పందంపై బ్రస్సెల్స్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరగటంతో పోలీసులు వాటిని అదుపుచేసేందుకు బాష్పవాయు గోళాలు, వాటర్ కేనన్లు ప్రయోగించారు. ఈ ప్రదర్శనలు జరిగిన రెండు రోజులకే ప్రధాని మైకేల్ తన పదవికి రాజీనామా చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm