వెల్లింగ్టన్ : ఇవాళ ఉదయం న్యూజిలాండ్‌లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఎల్ఎస్పెరెన్స్ రాక్‌కు ఆగ్నేయంలో 248 కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృమైనట్టు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భూకంపం కారణంగా జరిగిన నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm