న్యూఢిల్లీ: రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వెయిట్ లిఫ్టర్ సంజితా చానుపై విధించిన సస్పెన్షన్‌ను అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ తాత్కాలికంగా తొలగించింది. డోప్ టెస్టింగ్‌లో పాజిటివ్ అని తేలడంతో సంజితాపై ఐడబ్లూఎఫ్ 15 మే, 2018న నిషేధం విధించింది. ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..చానూపై విధించిన నిషేధం తాత్కాలికంగా తొలగింది. చానూపై తమకు పూర్తి నమ్మకం ఉందని, దేశం ఆమెను వదులుకోవడానికి సంసిద్ధంగా లేదని ఆయన అన్నారు. నిషేధం ఎత్తేసేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm