జమ్ముకశ్మీర్: తన కొడుకు ఉగ్రవాదని తనకు తెలియదన్నాడు నిన్న నలభై మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ తండ్రి. అహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాల గురించి తనకే మాత్రం తెలియదని, జమ్ముకశ్మీర్ పోలీస్ చెబితేనే తెలిసిందని అతనన్నాడు. మా వాడు పన్నెండో తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా జమ్ము వెళ్లిన అతడు తిరిగి రాలేదన్నాడు. అతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఎలా ఏర్పడిందో.. ఎలా ఈ దాడికి పాల్పడ్డాడో తమకు ఏ మాత్రం తెలియదన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm