హైదరాబాద్: ఓ ప్రేమజంట నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. భజరంగ్‌దళ్, వీహెచ్ కార్యకర్తలు నిన్న నగర శివారులో ఓ ప్రేమజంటకు వివాహం చేసిన విషయం తెలిసిందే. కాగా బలవంతపు వివాహంతో మనస్తాపానికి గురై యువతి యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. లేక్ పోలీసులు హుస్సేన్‌సాగర్‌లో దూకిన ఈ ప్రేమికులను కాపాడారు. కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబాలకు సమాచారం అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm