హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ రేపు ఉదయం 11.30 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లో రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. 10 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. స్వయంగా సీఎం కేసీఆరే ఈరోజు వారికి ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. కేసీఆర్ ఖరారు చేసిన జాబితాలో ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, వి.శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేమకూర మల్లారెడ్డికి చోటు దక్కింది
Mon Jan 19, 2015 06:51 pm