హైదరాబాద్ : ప్రేమోన్మాది భరత్ దాడిలో గాయపడి కోలుకుంటున్నవిద్యార్థిని మధులిక వాంగ్మూలం ఇచ్చింది. మేజిస్ట్రేట్ సమక్షంలో మధులిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. భరత్ తనకు చిన్నప్పటి నుంచి పరిచయం అని, ఒకే కాలనీలో తాము నివసిస్తుండటంతో అతనితో మాట్లాడే దానినని చెప్పింది. భరత్ తనపై ఇంత కోపం పెట్టుకుంటాడని కలలో కూడా అనుకోలేదని, మూడేళ్లుగా ప్రేమ పేరుతో భరత్ తనను వేధిస్తున్నాడని, అందుకు నిరాకరించిన తనపై వేధింపులకు దిగాడని పేర్కొంది. మూడు నెలల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పానని, షీ టీమ్, భరోసా సెంటర్ ను ఆశ్రయించామని చెప్పింది. పోలీసుల కౌన్సిలింగ్ తతో భరత్ మారతాడనుకున్నాను కానీ, తనపై ఇంత కోపం పెంచుకుంటాడని ఊహించలేదని తన వాంగ్మూలంలో మధులిక తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm