హైదరాబాద్: రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నల్లగొండ జిల్లా పెద్దవూర సర్పంచ్ కర్నాటి విజయభాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా నారపోగు వెంకటనారాయణ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇందులో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు.. కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఫోరం తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm