హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడితో గొడవ పడి నోరు,ముక్కును కొరికాడు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిని ఆబిడ్స్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రవి కుమార్ కథనం ప్రకారం... ఆబిడ్స్ ఛాపెల్ రోడ్‌లోని ఓ బేకరిలో శ్రీశైలం,వెంకటేష్‌లు పని చేస్తున్నారు. రాత్రి సమయంలో పీకల దాకా మద్యం తాగి వచ్చిన శ్రీశైలం.. వెంకటేష్‌తో గొడవ పడ్డాడు. వెంకటే ష్ నోరు పెదాలు, ముక్కు కొరికి వేశాడు. దీంతో వెంకటేశ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును నమోదు చేసుకుని వెంకటేష్‌ను వైద్య చికిత్స కోసం ఉస్మానియాలో చేర్పించారు. నిందితుడు శ్రీశైలంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm