న్యూఢిల్లీ: ఆరు సార్లు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ఎంసీ మేరికోమ్, రెండేళ్ల పాటు ప్రపం చ వ్యాప్తంగా క్రీడా వస్తువులు అందిస్తున్న ప్రముఖ పూమా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సోమవారం ఎంపికైంది. దేశ వ్యాప్తంగా పూమాకు సంబంధించిన అన్నీ క్రీడా వస్తువులను మేరికోమ్ ప్రచారం నిర్వహిస్తుంది. 'మాగ్నిఫిసెంట్ మేరీ'గా ప్రపంచానికి పరిచయం. ఐఓఎస్ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ అసోసియేషన్ మేరికోమ్ పేరును ప్రతిపాదించింది. బాక్సర్ ఛాంపియన్‌గా, సూపర్ మామ్‌గా మేరి కోమ్ సుపరిచితురాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తల్లులకు రోల్ మోడల్‌గా కూడా నిలిచింది. పూమా ప్రచారకర్తగా ఎంపికవ్వడంతో దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలను మరింత ప్రతిభావంతులుగా, ధైర్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోపడుతుంది. ఈ సందర్భగా మేరీకోమ్ మాట్లాడుతూ.. ఒక తల్లిగా, మహిళగా ఎన్నో ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నా అని తెలిపింది. ఈ స్థాయిలో ఉండటానికి సహకరించిన కుటుంబ సభ్యులకు, బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. పూమా మంచి కంపెనీ అని, మహిళలను క్రీడల్లో ప్రోత్సహించడంలో, సాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు. పూమా కుటుంబంలో మేరికోమ్ అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, భారత్‌లో మహిళల కేటగిరీని మరింత ముందుకు తీసుకెళ్లారని పూమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm