హైదరాబాద్: వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పూర్తి వివరాల జాబితాను ప్రభుత్వం రూపొందిస్తున్నది. 15 శాఖల నుంచి వచ్చిన వివరాలను.. ఇదివరకే తన వద్దనున్న వివరాలతో సరి చూసుకుంటున్నది. మరో 12 శాఖల నుంచి వచ్చిన డాటా మొత్తం ఒకచోటకు తీసుకువచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత ఉద్యోగుల పూర్తివివరాలతో కూడిన జాబితాను ఆర్థికశాఖ రూపొందించనున్నది. దీంట్లో మంజూరైన పోస్టులు ఎన్ని? ఉన్న ఉద్యోగులు ఎంతమంది? ఖాళీలు ఎన్ని? ఎప్పుడు ఎంతమంది రిటైర్డ్ అవుతారు? కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎందరు? అనే వివరాలతో కూడిన జాబితాను రూపొందిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm