హైదరాబాద్: ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో వివిధ భాషల కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరు రెండు కోర్సులకు మాత్రమే దరఖాస్తు చేయాలి. జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 250 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఈనెల 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ ప్రవేశాల కోసం మార్చి 30, 31 తేదీల్లో, పీజీ, పీజీడిప్లొమా, బీఈడీ, పీహెచ్డీ కోర్సులకు మార్చి 9, 10 తేదీల్లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్, విజయవాడ సహా 22 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. వర్సిటీలో ప్రవేశం పొం దిన విద్యార్థులకు వసతి, స్కాలర్షిప్ సౌకర్యం ఉంటుం ది. వివరాలకు http://www.efluniver sity.ac.in/ వెబ్సైట్లో సందర్శించాలి.
Mon Jan 19, 2015 06:51 pm