హైదరాబాద్ : మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్ఫోన్ వివో యు1 ను ఇవాళ చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 6.2 ఇంచుల భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని అమర్చారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను అమర్చగా, 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8,430 ధరకు లభ్యం కానుండగా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,645 ధరకు లభ్యం కానుంది.
Mon Jan 19, 2015 06:51 pm