హైదరాబాద్ : పాఠశాల బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందింది. ఈ విషద సంఘటన నిర్మల్లో చోటుచేసుకుంది. స్థానిక కృష్ణవేణి పాఠశాలలో సాన్విక(4) అనే చిన్నారి నర్సరీ చదువుతుంది. చిన్నారిని ఇంటిదగ్గర దింపివెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు వెనుకచక్రం కిందపడింది. అక్కడికక్కడే మృతిచెందింది.
Mon Jan 19, 2015 06:51 pm