హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్స్ (ఏవోసీ)లోని గజరాజ్ స్టేడియంలో సోల్జర్ (ఫార్మ) ఉద్యోగాల కోసం మార్చి 30వ తేదీన రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్టు రక్షణ విభాగం పౌరసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన అభ్యర్థులతోపాటు పుదుచ్చేరి(యూటీ) ప్రాంతానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 20నుంచి మార్చి 21వరకు ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, అడ్మిట్ కార్డులను మార్చి 22న అందిస్తారని తెలిపారు. 23నుంచి www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ నుంచి కూడా అడ్మిట్ కార్డును తీసుకోవచ్చని, వివరాలకు 040-27740059 నెంబర్ను సంప్రదించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm