జయపుర: విక్టరీ వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ హోటల్లో ఆశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వేడుకకు రామ్చరణ్, ఉపాసన, నాగచైతన్య, సమంత, సల్మాన్ ఖాన్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జయపురలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm