హైదరాబాద్: ఫిలింఫేర్ అవార్డుల వేదికపై రణ్‌బీర్ కపూర్‌పై తనకున్న ప్రేమను ఆలియా భట్ వ్యక్తపరిచారు. 'రాజీ' సినిమాకు గానూ ఆలియా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపైకి వెళ్లిన ఆమె తనకు అవార్డు రావడానికి కారణమైన వారికి ధన్యవాదాలు చెప్పారు. నా దృష్టిలో రాజీ అంటే మీరే మేఘనా (దర్శకురాలు). మీరు ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. విక్కీ కౌశల్ మీరు లేనిదే.. ఈ సినిమా పరిపూర్ణం అయ్యేది కాదు. నా మెంటార్ కరణ్‌కు, నా తండ్రికి ధన్యవాదాలు. ఈ రాత్రి ప్రేమతో నిండిపోయింది. నాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి.. ఐ లవ్ యు రణ్‌బీర్ అని ఆలియా అందరి సమక్షంలో చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm