హైదరాబాద్: వెనిజులా రాష్ట్రమైన కారబబలో శక్తివంతమైన కొలంబియా పేరా మిలటరీ నాయకుడిని అరెస్టు చేసినట్లు వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో తెలిపారు. అయితే అరెస్టు చేసిన వ్యక్తి పేరును ఆయన వెల్లడించలేదు. పొరుగున గల కొలంబియా క్రిమినల్ గ్రూప్ అయిన 'రాస్త్రోజోస్ అధిపతి' అని మాత్రమే ప్రస్తావించారు. కొలంబియా ఎవరిని కిరాయికి తీసుకుందో, వెనిజులాకి పంపించిందో తమ వద్ద సాక్ష్యాధారాలు వున్నాయని అన్నారు. కిరాయి దుండగులను, పేరా మిలటరీని వెనిజులాలోకి పంపించి హింసను సృష్టించాలనేది వారి కుట్రగా వుందని అటువంటి వాటిని సాగనీయబోమని మదురో, కమ్యూనికేషన్, సమాచార శాఖ మంత్రి జార్జి రొడ్రిగజ్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత జువాన్ గెయిడో సహాయకుడు, అరెస్టయిన వ్యక్తి రాబర్టో మరెరో ఇచ్చిన సమాచారం మేరకే తాజాగా ఈ అరెస్టు జరిగిందని మదురో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm